ముగిసిన హెల్త్ వర్సిటీ క్రీడా పోటీలు
గన్నవరంరూరల్: వైద్య విద్యార్థులు క్రీడల్లో రాణించటం అభినందనీయమని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. మండలంలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పురుషుల 26వ ఇంటర్ క్రీడా పోటీలు సోమవారంతో ముగిశాయి. ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను రాజమండ్రి జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల కై వసం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో విన్నర్‌గా రాజమండ్రి జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, రన్నర్‌గా ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాల నిలిచాయి. టేబుల్ టెన్నిస్‌లో విన్నర్‌గా శ్రీకాకుళం గ్రేట్ జీఈ మెడికల్ కళాశాల, రన్నర్‌గా అనంతపురం మెడికల్ కళాశాల, టెన్నిస్‌లో విన్నర్‌గా గుంటూరు కాటూరి మెడికల్ కళాశాల, రన్నర్‌గా రాజమండ్రి జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, ఫుట్‌బాల్‌లో రాజమండ్రి జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల మెడికల్ విద్యార్థులు రాణించారు. విజేతలకు ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవినేని రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment