నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం తక్షణమే సమగ్ర కౌలు చట్టాన్ని తేవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. అనంతరం సంఘం ప్రతినిధులు డీఆర్వో లక్ష్మీనరసింహంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జలమయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది కౌలురైతులు ఉన్నారని, వీరి రక్షణ, సంక్షేమం కోసం సమగ్రమైన కౌలు చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 90శాతానికి పైగా కౌలు రైతులే ఉంటున్నారన్నారు. కౌలు కార్డులు లేని కారణంగా వారికి ఎక్స్‌గ్రేషియా అందడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యల్లమందారావు, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్, ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment