
మలేరియా ల్యాబ్ టెక్నీషియన్లకు పునశ్చరణ శిక్షణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా మలేరియా విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి రెండు రోజుల పాటు నిర్వహించే పునశ్చరణ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. అజిత్‌సింగ్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణను డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్లు సుశిక్షతులై రాబోయే రోజుల్లో మలేరియా, పైలేరియా వంటి వ్యాధుల నియంత్ర ణలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీ బాబు మాట్లాడుతూ.. మలేరియా విభాగంలో పనిచేసే ఎల్‌టీలను మూడు బ్యాచ్‌లుగా విభ జించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాచ్‌కు రెండు రోజుల శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ రామనాథ్‌రావు, మలేరియా పూర్వ అధికారులు రత్నజోసఫ్, ఆదినారాయణ పాల్గొన్నారు.
తిరుపతమ్మ ఆలయానికి రూ.1.03 కోట్ల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మంగళవారం ఆలయ బేడా మండపంలో బహిరంగ వేలం జరిగింది. ఈ వేలంలో ఆలయానికి రూ.1,03,55,000 ఆదాయం సమకూరిందని ఈఓ కిషోర్‌కుమార్ తెలిపారు. ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కును రూ.58.50 లక్షలు, పొంగళి షెడ్ల నిర్వహణ, పొంగలి తయారీ సామగ్రి విక్రయించుకునే హక్కునకు రూ.29.55 లక్షలకు పచ్చల శివప్రసాద్ హెచ్చు పాటదారుగా నిలిచి దక్కించుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలో పొంగలి షెడ్డు వద్ద మట్టికుండలు విక్రయించుకునే హక్కును కె.వీరవర ప్రసాద్ రూ.15.50 లక్షలకు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శనగల కొనుగోలు
కేంద్రాలు ప్రారంభం
కంచికచర్ల: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, మండలంలోని కొత్తపేట గ్రామ సచివాలయంలో శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ డీఎం కె.నాగమల్లిక మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు డీఎం మాట్లా డుతూ.. సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతూ తమకు కేటాయించిన తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి తాము పండించిన శనగ పంటను విక్రయించుకోవచ్చని తెలిపారు. క్వింటా శనగల మద్దతు ధర రూ.5,650గా ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. నిర్ణీత తేమశాతం, నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే శనగలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. నగదు మాత్రం రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమవుతుందని డీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, సూపర్‌వైజర్ కె.నరేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment