
చిన్న తిరునాళ్లలో అపశ్రుతి
ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వత్సవాయి మండలం కొత్త రేగులగడ్డకు చెందిన సోదరులు గింజుపల్లి సాయిమణికంఠ (24), గింజుపల్లి గోపి మంగళవారం రాత్రి తిరునాళ్లకు వచ్చారు. ఎగ్జిబిషన్‌లోని క్రాస్ జయింట్ వీల్ ఎక్కారు. ప్రమాదవశాత్తు తొట్టి లింక్ ఊడటంతో వారు ఇద్దరు పైకి లేచి పక్కనే ఉన్న సీసీ రోడ్డుపై పడిపో యారు. ఈ ప్రమాదంలో సాయిమణికంఠ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గోపికి కాలు, చెయ్యి విరగ టంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరికీ వివాహం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిమణికంఠ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తూ తిరునాళ్లకు ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు పాటించక పోవటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

చిన్న తిరునాళ్లలో అపశ్రుతి
Comments
Please login to add a commentAdd a comment