
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా దరఖాస్తు చేసుకున్న వెంటనే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమా వేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలోని పారిశ్రామికవాడల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సింగిల్ విండో పద్ధతిపై పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు, రాయితీలు కల్పించాలన్నారు. పరిశ్రమల ఏర్పాట్లలో మౌలిక వసతులకు సంబంధించి ఆయా శాఖల వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలన్నారు. సముద్రపు నాచు పెంపకం ప్రాజెక్టు ఏర్పాటు కోసం స్థలం కొనుగోలుకు సొంత నిధులను వెచ్చిస్తామని, రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు కలిగిన తీర ప్రాంతంలో అనువైన స్థలాన్ని కేటాయించాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్త కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మత్స్యశాఖ జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టా లని సూచించారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు, డీఆర్డీఏ పీడీ వై.హరి హరనాథ్, ఎల్‌డీఎం రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment