విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
u8లో
ఇఫ్తార్ సహరి
(బుధ) (గురు)
విజయవాడ 6.23 4.56
మచిలీపట్నం 6.22 4.53
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు, మండలంలోని కొత్తపేట గ్రామ సచివాలయాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతోంది. గత ఏడాది వరదల సమయంలో విజయవాడ కలెక్టరేట్‌లో వారం రోజులకుపైగా బసచేసి, నగరంలో ముంపు నివారణ కోసం ఎన్నికోట్లు అయిన ఖర్చు చేస్తామని హడావుడి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మళ్లీ దాని గురించి పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా బుడమేరు ఆధునికీకరణ విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలుత బుడమేరు ప్రక్షాళన అంటూ మొదలు పెట్టి.. తొలి దశకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. తీరా బడ్జెట్‌లో చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు బుడమేరు మళ్లింపు కాలువలకంటూ కొన్ని నిధులు విధిల్చారు. మంగళవారం జరిగిన మంత్రి వర్గంలో రూ.37.97 కోట్లను కేటాయించారు. కేవలం గండ్లు పడిన ప్రాంతంలో వరద నివారణకు రక్షణ గోడల నిర్మాణానికి మాత్రమే జలవనరులకు శాఖకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఆధునికీకరణ ఊసే ఎత్తలేదు. దీంతో బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బాధితుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటం..
మొదటి నుంచి వైఎస్సార్ సీపీ బుడమేరు బాధితులకు అండగా నిలిచింది. బాధితులకు సాయంతోపాటు, ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపట్టింది. గవర్నర్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇదే సమస్యపై మండలిలో రెండుమార్లు డాక్టర్ మొండితోక అరుణకుమార్ సమస్యను ప్రస్తావించి, న్యాయం చేయాలని కోరారు. బుడమేరు బాధితులకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆ సమయంలో సాక్షాత్తూ విపత్తుల శాఖ మంత్రి బాధితులను ఆదుకోవడానికి రూ.497.07 కోట్ల విరాళాలు వచ్చాయని, వీటితో బాధితుల సహాయం కోసం రూ.274.95కోట్లు, ఖర్చు చేశామని చెప్పారు. అయితే మిగిలిన నిధులతో అయినా కనీసం పనులు నిర్వహించకపోవడం గమనార్హం.
వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్ రెగ్యులేటర్ లాకులు పూర్తిగా కిందకు దిగకపోవడంతో నీరు లీకవ్వకుండా వేసిన ఇసుక బస్తాలు
కవులూరు శివారులో గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకవుతున్న నీరు
7
న్యూస్‌రీల్
బుడమేరు యాక్షన్ ప్లాన్ అమలేది?
వరదలు వచ్చిన సమయంలో విజయవాడ ప్రజలను ముంపు నుంచి రక్షించాలనే లక్ష్యంగా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణ రూపొందించారు. నగరాన్ని ముంపు రహిత మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు హడావుడి చేశారు. ప్రాథమికంగా మొదటి దశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని 5వేల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 13.25 కిలోమీటర్ల వరకు బుడమేరు ఆక్రమణలకు గురైందని తేల్చారు. ఇందులో విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 202 ఎకరాలకు గానూ 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా, వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే విధంగా ప్రణాళిక రచించారు. దీంతో పాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్లే 50.6 కిలో మీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
బెజవాడ దుఃఖదాయినిని
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
హడావుడి చేసి చేతులెత్తేసిన వైనం
కేవలం గండ్లు పూడ్చేందుకు
మాత్రమే నిధుల కేటాయింపు
ఈ సీజన్‌లో పనులు
చేయకపోతే వచ్చేది కష్టకాలమే
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళన
వ్యక్తం చేస్తున్న ప్రజలు
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment