కార్మికులపై కక్ష సాధింపులు ఆపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలని, కార్మికులకు వేతనాలు, మెనూ చార్జీలు పెంచాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రోడ్డెక్కారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేలు వేతనం పెంచాలని, మెనూ చార్జీలు పాఠశాల విద్యార్థులకు రూ.20, కాలేజీ విద్యార్థులకు రూ.40 పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉత్తర, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ధర్నా
Comments
Please login to add a commentAdd a comment