మే 15 నుంచి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు
లోగో ఆవిష్కరించిన సీపీఐ
జాతీయ కార్యదర్శి నారాయణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో జాతీయ మహాసభల లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమ ఆటుపోట్లను ఎదుర్కొన్న అఖిల భారత యువజన సమాఖ్య పోరాడి వయోజనులకు ఓటు హక్కు సాధించిందన్నారు. ‘జాబ్ ఆర్ జైల్’, ‘సేవ్ ఇండియా చేంజ్ ఇండియా’ నినాదాలతో ఉద్యమించిందని అన్నారు. జాతీయ 17వ మహాసభలలో నిరుద్యోగ యువత, ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ రూపకల్పన చేస్తామన్నారు. జాతీయ మాజీ కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం. యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment