ఉత్సాహంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు

Published Wed, Mar 19 2025 2:13 AM | Last Updated on Wed, Mar 19 2025 2:11 AM

ఉత్సాహంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు

ఉత్సాహంగా ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు

విజయవాడస్పోర్ట్స్‌: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 173 మంది సభ్యులు పాల్గొంటున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం క్రికెట్‌, వాలీబాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, త్రో బాల్‌, టెన్నిస్‌, కబడ్డీ పోటీల్లో ప్రజాప్రతినిధుల జట్లు తలపడ్డాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహభరితంగా తలపడ్డారు. శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల డీఎస్‌డీవోలు ఎస్‌.ఎ.అజీజ్‌, జాన్సీ, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ కోటేశ్వరరావు ఈ పోటీలను పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement