మంగినపూడి బీచ్ ఉత్సవాలకు సిద్ధం కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): త్వరలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంసి ద్ధంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బీచ్ ఉత్సవాల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముఖ్య మంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తరువాత మంత్రి కొల్లు రవీంద్రతో బీచ్ ఉత్సవాలపై చర్చించి నిర్వహణ తేదీలను నిర్ణయిస్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో మాదిరిగా మ్యూజికల్ నైట్, ఫుడ్ స్టాల్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఎగ్జిబిషన్, హ్యాండీ క్రాఫ్ట్స్, హెలికాప్టర్ రైడింగ్, సాంస్కృతిక కార్యక్ర మాలు, వాటర్ స్పోర్ట్స్‌తో ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుల అంచనాల నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాన్ని దూరంగా ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పర్యాటకులు ప్రభుత్వ వాహనాల్లో సముద్రతీరం వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గీతాంజలిశర్మ, రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకుడు మల్లికార్జునరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీపీఓ అరుణ, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణారావు, బందరు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment