ఆటోలో బ్యాగ్‌ను మర్చిపోయిన మహిళ
గంటలో రికవరీ చేసిన పోలీసులు
పాయకాపురం(విజయవాడరూరల్): బంగా రపు వస్తువులున్న బ్యాగ్‌ను ఓ మహిళ ఆటోలో మర్చిపోయింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నున్న పోలీసులు గంట వ్యవధిలోనే ఆ బంగారం వస్తువులున్న బ్యాగ్‌ను రికవరీ చేసి, బాధితురాలికి అందజేసిన ఘటన బుధవారం జరిగింది. సుందరయ్య నగర్‌కు చెందిన ఐలూరి ప్రసన్న అనే మహిళ విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద పరిమళ పాపారావు ఆటో ఎక్కింది. బంగారం వస్తువులున్న బ్యాగ్‌ను మర్చిపోయి ఇంట్లోకి వెళ్లింది. కొద్దిసేపటికి ఆటోలో బ్యాగ్ మర్చిపోయినట్టు గుర్తు తెచ్చుకున్న ఆమె నున్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ పి.కృష్ణమోహన్ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటోని గుర్తించారు. అందులో చూడగా బంగారపు వస్తువులున్న బ్యాగ్ యథావిధిగా ఉంది. ఆ బ్యాగ్‌ను తిరిగి బాధితురాలికి సీఐ అందజేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment