హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్
పటమట(విజయవాడతూర్పు): రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయటానికి దూకుడుగా వ్యవరిస్తోందని అఖిల భారత మాలసంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, క్యాబినెట్ నిర్ణయం, ఆర్‌ఆర్ మిశ్రా నివేదికకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడ నగరంలోని ధర్నాచౌక్‌లో పోలీస్ అనుమతితో శాంతియుతంగా ధర్నా చేపట్టామని, ముందు అనుమతి ఇచ్చి తర్వాత లేదని తమను గృహ నిర్భంధం చేయటంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల పురోగతిని అణచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టిన తమను హోంమంత్రి కనుసన్నల్లో నిర్భందించి తమ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment