ఏకపక్షంగా కేసులు కట్టడం సరికాదు
వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌పై డీసీపీకి వినతి
పెనుగంచిప్రోలు/లబ్బీపేట(విజయవాడ తూర్పు): వైఎస్సార్ సీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌పై సరైన న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి చిన్నతిరునాళ్ల సందర్భంగా ఈనెల 18న తెల్లవారు జామున పసుపు–కుంకుమ బండ్లు సమర్పించేందుకు అన్ని పార్టీల వారు ప్రభలు కట్టుకుని వస్తుండగా పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. దీనిపై పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తల పైన మాత్రమే కేసులు పెట్టటం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించి, పోలీసులు వారికి గాయాలయ్యేందుకు కారణమైన ఇరుపార్టీల వారిపై కేసులు కట్టాలని వారు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, శ్రీకనకదుర్గమ్మవారి ఆలయ మాజీ డైరక్టర్ నంబూరి రవి, న్యాయవాది పృధ్వీ, ఎస్సీసెల్ నాయకులు కన్నమాల శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.
ఘర్షణ కేసులో 16 మందికి రిమాండ్
పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో భాగంగా మంగళవారం తెల్లవారు జామున ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి బుధవారం 16 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment