ఎన్టీటీపీఎస్ కోల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్ ప్లాంట్ లోని టీపీ–9, 4ఏ2బెల్డ్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు బుధవారం తెల్లవారుజాము వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. విద్యుత్ ఉత్ప త్తి కోసం వ్యాగన్ టిప్లర్ వద్ద నుంచి బెల్ట్‌ల ద్వారా బొగ్గు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కాకుండా ఆలస్యంగా స్పందించడంతో బొగ్గు సరఫరా బెల్ట్‌తో పాటు వివిధ రకాల సామగ్రి కాలిబూడిదగా మారి మరింత నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50లక్షల మేరకు సంస్థకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కోల్‌ప్లాంటులో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయనే అంచనా ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జరిగిన ప్రమాదాన్ని పక్కన పెట్టి బెల్డ్, తదితర సామగ్రికి ఇన్సూరెన్స్ ఉందనే వాదన అధికారులు తెరపైకి తేవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment