విజయవాడ కల్చరల్: అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి 2025–2026, 2026–2027 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకట దశరథ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సంస్థ అధ్యక్షుడిగా కామర్స్ విజయభార్గవ రాజేష్, కాశీభట్ల సూర్యనారాయణ శాస్త్రి ఉపాధ్యక్షుడు, కోశాధికారి అనుముల సోమశేఖర్, సీతారాంబాబు, ఈసీ సభ్యులుగా డాక్టర్ యడ్లపాటి శేషసాయి, భమిడిపాటి గణపతి, దత్తా ప్రసాద్,కుందేటి రత్నకుమార్, కావూరి సూర్యనారాయణమూర్తిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు.