
మెదడుపై ప్రభావం..
కాలుష్యం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెదడులో కీలక భాగాలపై కాలుష్యంలోని రసాయనాలు ప్రభావం చూపి న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తవచ్చు. అంటే కాలు, చేయి పట్టుతప్పడం, బ్రెయిన్‌స్ట్రోక్, వణుకుడు రోగం (పార్కిన్‌సన్) వంటివి రావచ్చు. కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ సమయాల్లో మాస్క్ వాడటం మంచిది.
– డాక్టర్ దేవనబోయిన అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్