ముందే ఖరారు! | - | Sakshi
Sakshi News home page

ముందే ఖరారు!

Published Mon, Apr 28 2025 1:13 AM | Last Updated on Mon, Apr 28 2025 1:13 AM

ముందే

ముందే ఖరారు!

పేరుకే టెండరు..

ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్‌లకు అనుమతులున్నాయి. అయితే పార్లమెంట్‌ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కసారబాద, కంచర్ల మండలం వేములపల్లి రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి ఈ ఇసుక రీచ్‌లను తన కనుసన్నల్లో ఉంచుకొని, ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి.. లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అది కాక తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి, దోపిడీ చేస్తున్నారు. అధికారులకు ఇదంతా తెలిసినా.. ఆయనకు చినబాబు అండదండలు ఉండటంతో ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. పేరుకు ప్రభుత్వం ఉచి త ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యు నికి ఇసుక అందుబాటులో లేదని, ట్రాక్టర్‌కు ఇసుక లోడ్‌ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక టెండర్ల కేటాయింపులో మాయాజాలం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇసుక టెండర్లలో మాయాజాలం చేశారు. పేరుకు మాత్రం టెండర్లు అంటూ హడావుడి చేసిన యంత్రాంగం.. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన అర్హతలు, మార్గదర్శకాల జాబితా విడుదల చేసి, పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చింది. బిడ్లు తెరిచి, టెండర్లు ఖరారు అయ్యే సమయానికి అసలు రంగు బయట పడింది. నిబంధనల పేరుతో తొలుత టెండర్లు రద్దు చేసి, చివరకు ముందే ఖరారు చేసుకున్న నాలుగు సంస్థలకు టెండర్లు కట్టబెట్టడంలో సక్సెస్‌ అయ్యింది.

‘బడా’ వ్యూహం..

కృష్ణా జిల్లాలో టెండర్ల ప్రక్రియను అధికారులు శనివారం సాయంత్రానికి పూర్తి చేశారు. టెండర్లు అన్నీ.. స్థానిక ప్రజా ప్రతినిధులకు దక్కేలా ఓ మంత్రి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, స్థానిక సంస్థలను కాదని, తమ బినామీ సంస్థలకు దక్కేలా పావులు కదిపారు. కృష్ణా జిల్లాలో చోడవరం, రొయ్యూరు, నార్తువల్లూరు, లంకపల్లి నాలుగు రీచ్‌లకు ఏప్రిల్‌ మొదటి వారంలో టెండర్లు పిలిచారు. వీటిలో ఒక్కో క్వారీకి డజనుకుపైగా కాంట్రాక్ట్‌ సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలకు స్థానికంగా జీఎస్టీ కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఓ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తమ బినామీలైన రాష్ట్రేతర సంస్థలతో టెండర్లు దాఖలు చేయించారు. ఈ సంస్థల జీఎస్టీలన్నీ స్థానికంగా కలిగి ఉన్నట్లు లోకల్‌ బ్రాంచ్‌లో నమోదు చేయించారు. టెండర్ల ప్రక్రియలో స్థానిక సంస్థలు అర్హత సాధించడంతో పోటీ నుంచి ఆ సంస్థలను తప్పించేందుకు పక్కా వ్యూహం అమలు చేశారు. టెండర్ల నోటిఫికేషన్‌, దరఖాస్తుల్లో కొన్ని తప్పులు ఉన్నట్లు సాకుగా చూపి టెండర్లను రద్దు చేశారు. మంత్రి ఆదేశాలను శిరసా వహించిన యంత్రాంగం వారి బినామీ సంస్థలకే కట్టబెట్టేలా సహకరించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ దందా..

నిబంధనల పేరుతో స్థానిక సంస్థలకు చెక్‌ కృష్ణా జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులకే టెండర్లు చక్రం తిప్పిన ఓ మంత్రి..వత్తాసు పలికిన అధికారులు ఎన్టీఆర్‌ జిల్లాలో పార్లమెంట్‌ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే అంతా.. ఇప్పటికే అనధికారికంగా వందల లారీల ఇసుక అక్రమ రవాణా

కృష్ణా జిల్లాలో

టెండర్లు వీరికే..

పెనమలూరులోని చోడవరం ఇసుక రీచ్‌ను స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. ఇప్పటికే ఈ రీచ్‌ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు.

రొయ్యూరు ఇసుక రీచ్‌ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజా ప్రతినిధి, రోజుకు వందల లారీలను ప్రముఖ కాంట్రాక్టు సంస్థ చేసే పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్‌ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకొంది.

పామర్రు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్‌ వచ్చింది. ఈ రీచ్‌ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 400కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్‌ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది.

ఇవి కాక చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను పచ్చనేతలు తరలిస్తున్నారు. మద్దూరు ఇసుక రీచ్‌లో అదే పరిస్థితి నెలకొంది.

అధికారులు మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధుల అడుగులకు మడుగులు ఒత్తుతూ, కళ్లముందే భారీ దోపిడీ జరుగుతున్న తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ముందే ఖరారు! 1
1/1

ముందే ఖరారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement