
అంత్యోదయ గృహ పథకం ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్‌లో అంత్యోదయ గృహ పథకం ప్రారంభానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ముఖ్యఅతిథిగా విచ్చేసి 28 మంది లబ్ధిదారులకు వర్క్ ఆర్డర్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్‌మఝి ఉగాది రోజు ఈ పథకం ప్రారంభించారు. జిల్లాలో రాయఘడ, గుసాని బ్లాక్, మోహనాలలో కలెక్టర్ బిజయకుమార్ దాస్ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయఘడ బ్లాక్ అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్, డి.ఆర్.డి.ఎ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, ప్రోగ్రాం మ్యానేజర్ బి.రోహిత్ కుమార్, రాయఘడ బి.డి.ఓ సుకాంత కుమార్ ప్రదాన్, అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధార్థ శంకర్ త్రిపాఠీ, తదితరులు పాల్గొన్నారు.