
గ్రామానికి తొలిసారి విద్యుత్ వెలుగులు
కొరాపుట్: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఒడిశాలో ఇప్పటికీ అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. అలాంటి గ్రామాల్లో నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి అమలబట్ట పంచాయతీ బరిగుడ ఒకటి. విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. బుధవారం సేవలు ప్రారంభించారు. కాగా, గ్రామానికి వెళ్లేందుకు ఎమ్మెల్యే ఆపసోపాలు పడాల్సి వచ్చింది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక చెక్క వంతెనపై ప్రమాదకర స్థితిలో బైక్‌పై దాటాల్సి వచ్చింది. అనంతరం అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ప్రతి ఇంటికీ వెళ్లి మీటర్ స్విచ్‌ను స్వయంగా నొక్కి సేవలు ఆరంభించారు.

గ్రామానికి తొలిసారి విద్యుత్ వెలుగులు