
తండ్రీకొడుకులపై ఆర్మీ జవాన్ దాడి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చిన్నసాన పంచాయతీ గంగుపేట గ్రామంలో తండ్రీకొడుకులపై ఓ ఆర్మీ జవాన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగుపేట గ్రామానికి చెందిన చదునుపల్లి అప్పన్నకు తన అన్న కుమారుడైన ఆర్మీ జవాన్ చదునుపల్లి రాముకు మధ్య కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. గురువారం ఉదయం ఈ విషయమై అప్పన్నకు రాముకు మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో రాము కత్తితో చిన్నాన్న అప్పన్నపై దాడి చేశాడు. తొడ, చేతులను తీవ్రంగా గాయపరిచాడు. అప్పన్న కుమారుడు హరిబాబు అడ్డుకునే ప్రయ త్నం చేయగా అతనికి సైతం గాయాలయ్యాయి. గ్రామస్తులు కలుగచేసుకుని గొడవను ఆపి బాధితులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్ప న్న పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వై ద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారాయ ణ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పొలం విషయంలో గొడవ
కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు