స్వర్ణలో రాష్ట్రస్థాయి పోల్‌రాధా ఎడ్ల పోటీలు
కారంచేడు: గ్రామ దేవత స్వర్ణమ్మతల్లి తిరునాళ్లను పరస్కరించుకొని ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి జూనియర్ నాటు ఎడ్ల పోల్‌రాధా (ఒంగోలు జాతి) పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఎడ్ల జత సత్తా చాటాయి. సోమవారం వేకువజాము వరకు జరిగిన పోటీల్లో నిర్ణీత 10 నిమిషాల వ్యవధిలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య చౌదరికి చెందిన ఎడ్ల జత 2478.9 అడుగుల దూరం లాగి తన సత్తా చాటి మొదటి బహుమతిని (రూ.30,116లు) కై వసం చేసుకున్నాయి. రెండో బహుమతిని ప్రకాశం జిల్లా మడనూరుకు చెందిన బత్తుల వంశీకృష్ణారెడ్డికి చెందిన ఎడ్లజత 2400 అడుగుల దూరం లాగి రూ.20,116 సంపాదించాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడంవారిపాలేనికి చెందిన కుంచాల వేదశ్రీ–లతారెడ్డిలకు చెందిన ఎడ్ల జత 2179.5 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం రూ.12,116 సాధించాయి. బాపట్ల జిల్లా పోతురాజు కొత్తపాలేనికి చెందిన కావూరు వెంకటేశ్వరరెడ్డికి చెందిన ఎడ్ల జత 2107.4 అడుగల దూరం లాగి నాలుగో స్థానం రూ1,116 గెల్చుకున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందిన 16 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతలుగా నిలచిన ఎడ్ల జతల యజమానులను నిర్వాహకులు ఘనంగా సత్కరించి బహుమతులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment