శావల్యాపురం: కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ ప్రతిభ ఉపకార పరీక్షల్లో ఫలితాల్లో 19 మంది శావల్యాపురం విద్యార్థులు అర్హత పొంది పల్నాడు జిల్లాస్థాయిలో ప్రథమస్థానం సాధించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ప్రతిభ పరీక్షల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హత పొందారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ. 12 వేలు చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ సందర్భంగా శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ఎంపికై న విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహించారు. విద్యాకమిటీ చైర్మన్ పాటిబండ్ల శ్రావణ్‌కుమార్, ప్రధానోపాధ్యాయురాలు బోడ్డపాటి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు కుమ్మరి శ్రీనివాస రాజు, రాగుల రాధాకృష్ణమూర్తి, సురేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment