ఆయిల్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు
నరసరావుపేట టౌన్: రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డెప్యూటీ కమిషనర్ పూర్ణచంద్రరావు ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ఎనిమిది ఆయిల్ మిల్లుల్లో తనిఖీలు చేశామని స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దాడులు అనంతరం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. నాలుగు జిల్లాల నుంచి ఎనిమిది మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను ఎనిమిది టీంలుగా ఏర్పాటుచేసి నరసరావుపేట ప్రాంతంలోని రీప్యాక్ ఆయిల్ మిల్లులను తనిఖీ చేశామన్నారు. ఎక్కడా ట్యాంకుల శుభ్రత కనిపించలేదున్నారు. వీరందరికీ నోటీసులు ఇవ్వటం జరుగుతుందని, అనుమానాస్పదంగా ఉన్న నూనె శాంపిల్స్ తీయటం జరిగిందన్నారు. వీటిని పరీక్షలకు పంపిస్తున్నామని, ఎక్కడ లోపం కన్పించినా వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. వీరందరిపై నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. వీరందరిపై ఎనిమిది కేసులు నమోదు చేశామన్నారు. మేము నరసరావుపేటలో 24 యూనిట్లకు లైసెన్స్‌లు మంజూరుచేశామని, అన్నింటినీ తనిఖీ చేస్తామన్నారు. రిటైలర్లు, శనగనూనె మిల్లులపై కూడా చర్యలు తప్పక ఉంటాయని తెలిపారు.
ఎనిమిది చోట్ల తనిఖీ.. అన్నిచోట్లా శుభ్రత లేని ట్యాంకులే.. కేసులు నమోదు
Comments
Please login to add a commentAdd a comment