ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి
నాదెండ్ల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు పని చేసినపుడే తల్లిదండ్రులకు నమ్మకం పెరిగి గుర్తింపు వస్తుందని డీఈవో ఎల్ చంద్రకళ చెప్పారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా ఎంపికై న నేపథ్యంలో కనపర్రు బీపీఆర్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బోధన తీరును చిన్నారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 2017లో ఈ పాఠశాలలో కేవలం 23 మంది విద్యార్థులే చదువుకునేవారని, ప్రస్తుతం 64 మంది చేరారంటే ఉపాధ్యాయుల కృషే కారణమని తెలిపారు. హెచ్‌ఎం రాజ్యలక్ష్మి యోగా నిపుణురాలైనందున విద్యార్థులకు యోగాతో పాటూ మంచి క్రమశిక్షణ అలవర్చటం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ముగ్గురు ఉపాధ్యాయులకు అదనంగా మరో ఇద్దరిని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని ఈబీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆమెతో పాటు నోడల్ ఆఫీసర్ ఎన్. పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈఓ చంద్రకళ
Comments
Please login to add a commentAdd a comment