అసంపూర్తిగా కోటప్పకొండ తిరునాళ్ల పనులు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు అసంపూర్తిగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. తిరునాళ్ల ఏర్పాట్లును శనివారం ఆయన పరిశీలించారు. కొండ దిగువున చిలకలూరిపేట మేజర్ కాలువ వద్ద శివ కుటుంబం పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. భక్తులు స్నానమాచరించే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కొండ మీదకు చేరుకొని ఆలయంలో ఏర్పాట్లపై సిబ్బందితో మాట్లాడారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరునాళ్ల విజయవంతం కావాలని, భక్తులు క్షేమంగా తిరిగి వెళ్లాలని స్వామిని కోరుకుంటున్నట్టు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపంతో పనులు అసంపూర్తిగా మిగిలాయని విమర్శించారు. కోటప్పకొండ– కొత్తపాలెం రోడ్డుతో పాటు పలు లింక్ రోడ్లు పనులు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. స్నానాల ఘాట్ దగ్గర మెట్లు మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. ఆదివారం నుంచే కొండకు భక్తులు రాక ప్రారంభమవుతుందని, పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. సీఎం చంద్రబాబు పర్యటన వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన ఆయన కోరారు. వీఐపీ పాస్‌లపై కూడా ప్రకటన చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాసరావు, పచ్చవ రవీంద్రబాబు, సర్పంచులు వెన్నపూస నాగిరెడ్డి, షేక్ పొదిలే ఖాజా, మట్లా లింగారెడ్డి, పాదర్తి వెంకటేశ్వరరావు, కనకా పుల్లారెడ్డి, పొనుగోటి వెంకట్రావు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వైఎస్సార్ సీపీ
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీనే అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం గుంటూరురోడ్డులోని పార్టీ కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మైనార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాదర్ బాషా, షేక్ కరీముల్లా, షేక్ ఖాదర్ బాషా, సిలార్ బాషా, యునిస్, సుభాని, ఎక్స్ కౌన్సిలర్ జిలాని, గౌస్‌పీర్ , వరవకట్ట జిలాని, పీఆర్వో కరీముల్లా, అజ్మల్, జానీ బాషా, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, గాబ్రియల్, విజయకుమార్, సురేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment