‘ఉయ్యాలవాడ’ త్యాగం అసమానం
నరసరావుపేట: ఆంగ్లేయుల దుష్ట పాలనపై తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయిల కన్నా ముందే కత్తిదూసి, పోరాడి ఉరికంభం ఎక్కిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి కొనియాడారు. స్థానిక ప్రకాష్‌నగర్‌లో శనివారం రెడ్డి బిజినెస్ గ్రూపు (ఆర్‌బీజీ) ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చినరామిరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలర్పించిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ అని పేర్కొన్నారు. ప్రస్తుత తరానికి, యువతకు ఆయన పోరాటాన్ని వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. న్యాయవాది ఆరెకూటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ దేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై అలుపెరగని పోరాటంచేసి అసువులు బాశారని తెలిపారు. మాజీ కౌన్సిలర్ మాగులూరి రమణారెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ బ్రిటిష్ పాలనపై పోరాటాలు చేసిన తెలుగు వీరుడని పేర్కొన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్ తియ్యగూర వీరారెడ్డి, ఇదా లింగారెడ్డి, వి.పెద్దిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రామిరెడ్డి, వెంకట్‌రెడ్డి, మోహనకృష్ణారెడ్డి, తుమ్మూరు శ్రీనివాసరెడ్డి, జీవీ సాంబశివరెడ్డి, యర్రంరెడ్డి నాగేశ్వరరెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment