నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించండి
నరసరావుపేట: గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ ఏకా మురళి ఆదేశించారు. ఈనెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులకు సంబంధించి శనివారం కలెక్టరేట్‌లోని డాక్టర్ గుర్రం జాషువా సమావేశం మందిరంలో పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ సామగ్రి స్వీకరించడం నుంచి పోలింగ్ అనంతరం తిరిగి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను సమర్పించే వరకు ప్రతి అంశం గురించి వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసే విధానం సంక్లిష్టంగా ఉంటుందని, ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటువేసే విధానం గురించి స్పష్టంగా తెలియజేయాలన్నారు. చెల్లని ఓట్లను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, పీఓలు, ఏపీఓలు, ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణలో డీఆర్‌ఓ మురళి
Comments
Please login to add a commentAdd a comment