
పల్నాడు
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
పోలీసుల స్వచ్ఛ భారత్
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు.
ఇఫ్తార్ సహర్
(గురు) (శుక్ర)
నరసరావుపేట 6.23 5.07
గుంటూరు 6.21 5.05
బాపట్ల 6.21 5.05
సాక్షి, నరసరావుపేట: అధికార బలం, ప్రభుత్వ అధికారుల సహకారంతో కూటమి నేతలు అక్రమార్జనకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట లేకుండా 200 ఎకరాల చేపల చెరువును అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చేపల సాగు మొదలుపెట్టారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడింది. నరసరావుపేట మండలం కాకానిలో 294 ఎకరాల్లో చేపల చెరువు ఉంది. ఇందులో 90 ఎకరాలకుపైగా ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మిగిలిన 200 ఎకరాలను మైనర్ ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తోంది. ఏటా చెరువుకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తారు. వేలంలో అత్యధిక ధరకు పాడిన వారికి ఏడాదిపాటు చేపలు పెంపకానికి అనుమతిస్తారు. సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు కావడంతో వేలంలో పెద్ద మొత్తంలో ధర పలుకుతుంది.
పట్టించుకోని అధికారులు
ఎనిమిది నెలలుగా చెరువులో చేపలు సాగవుతున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చెరువుకు అధికారులు వేలం నిర్వహించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ చెరువుకు ఇప్పుడు వేలం నిర్వహిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.20 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని పంచాయతీ, నీటి సంఘాలు, మైనర్ ఇరిగేషన్ శాఖకు కేటాయిస్తారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా చేపల సాగు చేస్తున్న అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నరసరావుపేట మండలం కాకాని చెరువు
టీడీపీ నాయకుల ఆక్రమణలో,,
న్యూస్‌రీల్
త్వరలో వేలంపాట
కాకాని చేపల చెరువుకు ఇప్పటివరకు వేలం పాట నిర్వహించలేదు. కలెక్టర్ అనుమతితో త్వరలో చెరువు వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎవరైనా చెరువులో చేపల సాగు చేస్తూ ఉంటే అది అక్రమంగా చేస్తున్నదే.
– మాధవీలత,
నరసరావుపేట ఆర్డీఓ
వేలం లేకుండానే చేపల
చెరువును స్వాధీనం చేసుకున్న వైనం
మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో
200 ఎకరాల చెరువు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ,
పంచాయతీ అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన వేలంలో దాదాపు రూ.12 లక్షలకు చెరువును వ్యాపారులు దక్కించుకున్నారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో వేలం పాటలు నామమాత్రంగా జరిగాయి. కనీస ధరకే టీడీపీ నాయకులు పాటను దక్కించుకొని చెరువులో చేపల పెంపకాన్ని చేపట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కరోనా వల్ల రెండేళ్లు వేలం పాట నిలిచిపోయింది. ఆ తరువాత కూడా వ్యాపారులు ముందుకు రాకపోవడంతో తక్కువ ధరలకే వేలం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేలం పాటలను నిర్వహించలేదు. చెరువును గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆక్రమించి జూలైలో చేప పిల్లలను వదిలి సాగును ప్రారంభించారు.

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment