పందికొక్కుల దాడిలో పసికందు మృతి!
నూజెండ్ల: ఊయలలో నిద్రిస్తున్న మూడు నెలల పసికందును పంది కొక్కులు కొరికి చంపిన ఘటన నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో బుధవారం జరిగింది. రవ్వారం గ్రామానికి చెందిన నాయిని కొండ గురవయ్య, దుర్గమ్మలు గ్రామాల్లో తిరిగి గాజులు అమ్ముకుని జీవనం సాగిస్తుటారు. వీరికి ఒక పాప ఉంది. సమీపంలోని ఓ తండా నుంచి మూడునెలల బాబు కౌషిక్‌ను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఎప్పటిలానే కొండ గురవయ్య గాజుల విక్రయానికి వెళ్లాడు. అదే సమయంలో పాప ఏడుస్తూ ఉండడంతో ఏదైనా కొని తెద్దామని తల్లి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఊయలలో ఒంటరిగా ఉన్న కౌషిక్‌పై పందికొక్కులు దాడి చేశాయి. తల వెనుక భాగాన, ముఖం, కాలివేళ్లను కొరికివేశాయి. దుకాణం నుంచి వచ్చిన తల్లి పరిస్థితిని గమనించి వైద్యశాలకు తరలించేలోపు చిన్నారి మృతి చెందింది. ముక్కుపచ్చలారని చిన్నారికి జరిగిన దారుణం చూపరులను కంటతడి పెట్టించింది.
పందికొక్కుల దాడిలో పసికందు మృతి!
Comments
Please login to add a commentAdd a comment