కోటప్పకొండ ఆలయ భూముల రికార్డులు ట్యాంపరింగ్
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆలయ భూముల్లో అక్రమ తవ్వకాలపై ‘దేవాంతకులు’ శీర్షికన సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొండకావూరు పరిధిలో నాయీబ్రాహ్మణులకు కేటాయించిన భూములను బుధవారం కోటప్పకొండ ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు పరిశీలించారు. అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు జరిపిన భూమి ఆలయానికి చెందిందిగా నిర్ధారించారు. భూముల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ఆరున్నర ఎకరాలలో దాదాపు రెండు ఎకరాల్లో అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం రెవెన్యూ రికార్డులను అధికారులు పరిశీలించారు. నాయీబ్రాహ్మణులకు కేటాయించిన భూములు రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు భూములుగా కనిపించాయి. గతంలోనే రెవెన్యూ రికార్డుల్లో ఆలయ భూముల ట్యాంపరింగ్ జరిగిందని భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. భూముల్లో ఆక్రమ తవ్వకాలు జరిపిన వారిపైనా చర్యలకు సమాయత్తమవుతున్నారు. పూర్తి వివరాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
ఈనాం భూములు ప్రైవేటువిగా మార్పు
అక్రమ తవ్వకాల వ్యవహారంతో
వెలుగులోకి
భూములను పరిశీలించిన
ఈఓ చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment