ఫిర్యాదుల పరిష్కారంలో శ్రద్ధ అవసరం
నరసరావుపేట: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ కనబరచాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం ఎండార్స్‌మెంట్ ఫిర్యాదుల విషయంలో అధికారులు విచారణ చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఫిర్యాదులు రీ ఓపెన్ కాకూడదని స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులపై నాలుగుస్థాయిల్లో ఆడిట్ జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన ఇంకొల్లుకు చెందిన గంటా సుబ్బారావుతో కలెక్టర్ నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదుదారు చెప్పిన అంశాలపై దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్షించి రికార్డులు వెరిఫికేషన్ కోసం 10వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అచ్చంపేట మండలం నిడుజెర్ల గ్రామానికి చెందిన పి.నాగరత్తమ్మతో కూడా ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుపై చర్చించారు. పోలీసులకు సూచనలు చేశారు.
పీ–4 సర్వేకు సహకరించండి
జిల్లాలో చేపట్టే పీ–4 సర్వేకు అందరూ సహకరించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సర్వే సూపర్‌వైజర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 8 నుంచి 18 వరకు పీ–4 సర్వే జరుగుతుందని పేర్కొన్నారు.
కలెక్టర్ అరుణ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment