నరసరావుపేట టౌన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఓ వ్యాపారి రాత్రికిరాత్రే కోట్ల రూపాయలకు ఐపీ పెట్టిన వైనం పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పాతూరులో స్థిరపడ్డాడు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్‌లో దుకాణం అద్దెకు తీసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ధాన్యం, మొక్కజొన్న వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో రైతుల వద్ద నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి వాటిని విక్రయించి ఆ తరువాత డబ్బులు ఇస్తుండేవాడు. ఈ క్రమంలోనే నాలుగు నెలలుగా రైతుల వద్ద నుంచి ధాన్యం, మొక్కజొన్న లారీలకు లోడ్‌లు ఎత్తుకున్నాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదు. ఈ మధ్య కాలంలో రైతులు అతని దుకాణం వద్దకు వచ్చి డబ్బుల కోసం నిలదీశారు. దీంతో 20 రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావు ఐపీ నోటీసులు పంపించాడు. సుమారు 80 మంది రైతులకు రూ.2 కోట్ల పైచిలుకు బాకీ ఉన్నట్లు సమాచారం. ధాన్యం వ్యాపారి ఐపీ పెట్టడం రైతు లను, వ్యాపారులను కలవరపాటుకు గురిచేసింది.
రైతులకు రూ.2 కోట్ల పైచిలుకు టోపీ
Comments
Please login to add a commentAdd a comment