అనుమతితోనే బల్లకట్లు, పడవలు నడపాలి
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో లైసెన్స్‌లు, అనుమతులు ఉన్న బల్లకట్టు, లాంచీలు, పడవలను మాత్రమే నడపాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో బల్లకట్లు, లాంచీలు, పడవలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వాటికి అనుమతులు ఉన్నదీ, లేనిదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో మురళి, సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, అచ్చంపేట, అమరావతి, దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచర్ల, మాచవరం తహసీల్దార్లుతోపాటు జిల్లా టూరి జం ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment