ప్రతి రైతు ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలి
వెల్దుర్తి: ప్రతీ ఒక్క రైతు తమ పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023–24 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, పంచాయితీ రాజ్‌శాఖ పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీల బృందం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 401 పనులకు గాను వేతనంగా రూ.7,03,58,938 /–లు, మెటల్ పనులకు రూ. 60,06,910/–లు మొత్తం రూ.7,63,65,848/–లు పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంట్ కింద 135 పనులకు రూ. 2499/–లు, మెటల్ పనులకు రూ 2,25, 37,721/–లు మొత్తం రూ.2,25,40,220/–ల పను లు జరిగాయన్నారు. ఈ పనులపై గ్రామసభల ను ఏర్పాటు చేసి ప్రజావేదికను నిర్వహించటం జరి గిందన్నారు. కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన రామచంద్రనాయక్ తనకు ఆరు సంవత్సరాల నుంచి జాబ్ కార్డు లేదని తెలిపినప్పటికీ ఎవరూ స్పందించలేదని పీడీ దృష్టికి తీసుకురావటంతో అర్థగంటలోనే జాబ్ కార్డును తయారు చేసి ఆయనకు ఇవ్వటం జరిగింది. రామచంద్రనాయక్‌ను పీడీ లింగమూర్తి మీ పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన వెంటనే మా పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. ఉపాధి హామీ సిబ్బంది రైతులను చైతన్యపరిచి పంట పొలాలలో ఫాంపాండ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన వెల్దుర్తి మండలంలో హార్టీకల్చర్ ద్వారా పండ్ల మొక్కలను నాటినప్పటికీ అవి బ్రతకటం లేదన్నారు. రైతులు పాంపాండ్‌ను ఏర్పాటు చేసుకుంటే కొంత వరకై నా పండ్ల మొక్కలను బ్రతికించుకోవచ్చన్నారు. 20 గ్రామ పంచాయతీలలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందాలు గ్రామ సభలు నిర్వహించి పనులు జరిగిన విధానాలను ప్రజావేదికలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఏపీడీ కొరటా మల్లిఖార్జునరావు, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కోటమ్మ, స్టేట్ రిసోర్స్‌పర్సన్ లోకేష్, ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఇ శ్రీనివాసరెడ్డి, ఏపీవో రేఖాజ్యోతి, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, డీఆర్‌పీలు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
పథకం పీడీ సిద్ధ లింగమూర్తి
Comments
Please login to add a commentAdd a comment