మాతా, శిశు మరణాలు నివారించాలి
వైద్యాధికారులకు సూచించిన డీఎంహెచ్‌వో
నరసరావుపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు చోటు చేసుకోకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో మాతృ, శిశు మరణాలపై సమీక్ష చేశారు. శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరేపల్లి ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, రామిరెడ్డిపేట యూపీహెచ్‌సీ, సత్తెనపల్లి, వినుకొండ కో–లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో జరిగిన మూడు శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులు, కాన్పులు నిర్వహించిన ప్రైవేటు వైద్యశాల నుంచి హాజరైన గైనకాలజిస్ట్, అనస్తిష్టు, చిన్నపిల్లల వైద్యులను విచారించి మరణాలకు దారితీసిన కారణాలు తెలుసుకున్నారు. గర్భిణులు పోషకాహారం, హిమోగ్లోబిన్ శాతం, గర్భస్థ శిశువు కదలికలన్నింటినీ తెలుసుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసే అల్ట్రా సోనోగ్రఫీ, టిఫ్ పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ లక్ష్మణరావు, డీపీహెచ్‌ఎన్‌వో బి.సురేఖ, ఏఎన్‌ఎం, ఆశాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment