సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘గంగూరి’
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాది గంగూరి అజయ్‌కుమార్ గెలుపొందారు. పట్టణంలోని న్యాయవాదుల సంఘం ప్రాంగణంలో గురువారం 2025–26 సంవత్సరానికి బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4.30 గంటల వరకు జరిగింది. మొత్తం 146 మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉండగా 139 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించగా రాత్రి 8 గంటల వరకు జరిగింది. అనంతరం ఎన్నికల ఫలితాలను ఎన్నికల ప్రధాన అధికారి గుజ్జర్లపూడి మార్కురావు, సహాయ ఎన్నికల అధికారి ఎన్.ఆంజనేయులు వెల్లడించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి 146 ఓట్లకు గాను 139 ఓట్లు పోలవ్వగా గంగూరి అజయ్ కుమార్‌కు 85 ఓట్లు రాగా ప్రత్యర్థి చిలుకా చంద్రశేఖర్‌కు 52 ఓట్లు, నోటాకు రెండు ఓట్లు వచ్చాయి. 33 ఓట్ల మెజార్టీతో గంగూరి అజయ్‌కుమార్ విజయం సాధించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి 146 ఓట్లకు గాను 139 ఓట్లు పోలు కాగా చిన్నం మణి బాబుకు 69 ఓట్లు రాగా ప్రత్యర్థి సర్వేపల్లి సీతారామాంజనేయులు (సీతయ్య)కు 68 ఓట్లు, నోటాకు రెండు ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు మెజార్టీతో చిన్నం మణిబాబు ఉపాధ్యక్షుడిగా విజయం సాధించాడు. 2022–23లో కూడా చిన్నం మణిబాబు ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు. సెక్రటరీ పదవికి 146 ఓట్లకు గాను 139 ఓట్లు పోలవ్వగా బయ్యవరపు నరసింహారావుకు 74 ఓట్లు, ప్రత్యర్థి పొత్తూరి హరిమణికంఠకు 64 ఓట్లు, నోటాకు ఒక ఓటు వచ్చాయి. సబ్‌కోర్టు సెక్రటరీగా 19 ఓట్ల మెజార్టీతో షేక్ జానీ ఖాజావలి విజయం సాధించాడు. గెలుపొందిన వారికి ఎన్నికల ప్రధాన అధికారి గుజ్జర్లపూడి మార్కురావు, సహాయ ఎన్నికల అధికారి ఎన్.ఆంజనేయులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఎన్నికల అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలను పలువురు న్యాయవాదులు ప్రత్యేకంగా అభినందించారు.
సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘గంగూరి’
సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘గంగూరి’
సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘గంగూరి’