
పల్నాడు
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ: గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్కిశెట్టి బుచ్చమ్మ, రాగాల భువనేశ్వరిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పోలీసుల ద్వారానే అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటికి ఎవరూ భయపడరని, ఎదురు తిరిగే రోజు వస్తుందన్నారు. మహిళలని చూడకుండా దాడి చేసి కాలు విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా దారుణం ఎక్కడుందని కూటమి పాలకులను నిలదీశారు. చిన్న గొడవలు జరిగినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి దెబ్బలు తగలకపోయినా 307 కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించాల్సింది పోయి ప్రోత్సహించడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. ఇలాంటి రాజకీయాలు మానుకొని ప్రజలకు రక్షణగా ఉండాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
చేతిలో చిల్లిగవ్వ లేక.. ఒంట్లో ఓపిక లేక.. శరీరంలో రోగం తగ్గక ‘అయ్యా .. మీరే దిక్కంటూ’ నరసరావుపేట ఏరియా ఆస్పత్రి తలుపును ఎవరైనా తడితే అక్కడ దౌర్భాగ్య పరిస్థితులు మరింత వెక్కిరిస్తున్నాయి. మంచంపై సొమ్మసిల్లితే విరిగిన ఫ్యాన్ల రెక్కలు ఉసూరుమంటున్నాయి. ముక్కు మూసుకుని మరీ మరుగుదొడ్ల వైపు వెళితే నీళ్లు లేని కుళాయిలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ కడుపు నొప్పంటూ రోగి విలవిల్లాడుతుంటే ఆలకించే సిబ్బంది లేరు. పది నెలల కూటమి పాలనలో కనీస వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రి అంటే కూటమి సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఉంది.
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు సేవల కోసం వచ్చే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ వైద్యశాలకు రోజు పల్నాడు జిల్లాతోపాటు బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 1,000 – 1,200 మంది ఓపీ నమోదు చేసుకుంటున్నారు. కూలీనాలీ చేసుకుని బతికే పేదోళ్లు ఇక్కడికి వచ్చాక వసతుల లేమితో నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న రోగం పోతుందో లేదో తెలియదుగానీ... కొత్త రోగం మాత్రం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో వైపు సిబ్బంది కొరతతో రోగులకు కనీసం సమాధానం చెప్పే వారు కరవయ్యారు.
వేధిస్తున్న స్టాఫ్ నర్సుల కొరత
ఈ వైద్యశాలకు 40 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 16 మంది మాత్రమే ఉన్నారు. వీరితో ఎలా సేవలు అందించాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతపై ఆరు నెలల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్‌కు లేఖ రాశారు. సరిపడా సిబ్బందిని కేటాయించాల్సిందిగా కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఉన్న సిబ్బందికీ పని ఒత్తిడి కారణంగా విధుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ ప్రభావం రోగులపై తీవ్రంగా పడుతోంది.
కనీస వసతులూ కరవే...
వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మరుగుదొడ్లు వద్ద దుర్వాసన వస్తోంది. గతంలో వంద పడకలుగా ఉన్న ఆస్పత్రిని 200 పడకలకు పెంచారు. శానిటేషన్ సిబ్బందిని మాత్రం పెంచలేదు. దీంతో ప్రభుత్వాస్పత్రి పరిసరాల్లోకి అడుగు పెట్టాలంటే ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రోగంతో ఆస్పత్రిలో అడుగుపెడితే రోగితోపాటు సహాయకులకు కూడా కొత్త వ్యాధులు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.
చొరవ చూపని అధికారులు
వైద్యశాలలో సీటీ స్కాన్ పరికరం అందుబాటులో లేదు. రోడ్డు ప్రమాదాల కేసులు ఇక్కడకు అధికంగా వస్తుంటాయి. అధిక శాతం తల భాగంలో తీవ్ర రక్త గాయాలైనవే ఉంటాయి. వైద్య సేవ అందించాలంటే సీటీ స్కాన్ అవసరం. అది అందుబాటులో లేకపోవడంతో కేసులను గుంటూరుకు పంపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దాత సీటీ స్కాన్ యంత్రం అందజేస్తామని ముందుకొచ్చారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఐసీయూ ఉన్నా నిరుపయోగమే ..
సిబ్బంది లేని కారణంగా ఐసీయూ ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేసి పది పడకలను సిద్ధం చేశారు. వెంటిలేటర్లు కూడా ఉన్నాయి. టెక్నీషియన్లు లేక ప్రయోజనం లేకుండాపోయింది. టెక్నీషియన్లు కావాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నియమించలేదు. పాయిజన్ కేసులను గుంటూరుకు పంపించాల్సి వస్తోంది.
9
న్యూస్‌రీల్
ప్రభుత్వాస్పత్రిలో అందని వైద్య సేవలు తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేని మరుగుదొడ్లు సిబ్బంది కొరతతో అరకొర వైద్యం సీటీ స్కాన్ మిషన్ లేక సిఫార్సులతో సరి పది నెలల పాలనలో అంతా అస్తవ్యస్తం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న రోగులు, సహాయకులు
రోగులపై ఆర్థికభారం
సైలెన్ సీసా తీసే వారూ లేరు
విరేచనాలతో బాధపడుతూ ఏరియా వైద్యశాలలో చేరాను. నీరసంగా ఉండటంతో సైలెన్ ఎక్కించారు. బాటిల్ పూర్తయినప్పటికీ తొలగించేందుకు సిబ్బంది రాలేదు. వారికోసం వెతికినా అందుబాటులో లేరు. చివరకు స్వయంగా నీడిల్‌ను తీసుకోవాల్సి వచ్చింది. పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
– ఎలిషా, వెల్లలచెరువు,
సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లా
సిబ్బంది కొరతపై నివేదిక
వైద్యశాలలో సిబ్బంది కొరతను ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే భర్తీకి చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య సిబ్బంది కాంట్రాక్ట్ పూర్తయిన కారణంగా కొత్త వారిని ఇంకా నియమించలేదు. కొత్త కాంట్రాక్ట్‌లో సిబ్బంది పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
– డాక్టర్ సురేష్ కుమార్,
సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. హెచ్‌డీఎస్ నిధులతో ఆసుపత్రికి అవసరమైన మౌలిక సౌకర్యాలు, అత్యవసరమైన మందులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినియోగిస్తారు. తొమ్మిది నెలలుగా రోగులకు వైద్య సేవలు, సరిపడా మందులు లేకపోయినా కమిటీ లేకపోవడంతో పట్టించుకోలేదు. సేవల కోసం వచ్చిన రోగులు బయట మందులు కొనుక్కోవడం, పరీక్షల కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థిక భారాన్ని మోశారు.

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు