
విద్యార్థినికి కలెక్టర్ అభినందనలు
మాచర్ల రూరల్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. పట్టణంలోని బాలికల పాఠశాల విద్యార్థిని షేక్ సమీరా 596 మార్కులు సాధించి పట్టణంలోనే రికార్డు నెలకొల్పింది. ఆమె తండ్రి సాధారణ మోటార్ మెకానిక్ షేక్ జాన్, తల్లి అబీదా గృహిణి. షేక్ సమీరాను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ మురళి, డీఈఓ చంద్రకళ అభినందించారు. అదేవిధంగా తమ పాఠశాల విద్యార్థిని సజ్యశ్రీకి 586 మార్కులు, ధరణికి 581 వచ్చాయని, 18 మంది 550 పైగా మార్కులు, 32 మందికి 500కి పైగా మార్కులు పొందారని హెచ్‌ఎం తెలిపారు.
● స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ బాలురు పాఠశాల విద్యార్ధి బి.మల్లిఖార్జున 585 మార్కులు సాధించాడని హెచ్‌ఎం ఎం.రామారావు తెలిపారు. తమ పాఠశాల 95శాతం ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు.

విద్యార్థినికి కలెక్టర్ అభినందనలు