ఏటా మూడు పంటల సాగు ప్రణాళిక
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఏటా మూడు పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. ఏపీసీసీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాభాగస్వా మ్య ప్రకృతి వ్యవసాయంపై కలెక్టరేట్‌లో శుక్రవా రం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావే శంలో ఆయన మాట్లాడారు. పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధులతో ఫారంపాండ్స్, చెక్‌డ్యాముల నిర్మాణం, చెరువుల అభివృద్ధి పనులు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఘన, ద్రవ జీవమృతాల తయారీతో పాటు వినియోగ పద్ధతులను ప్ర యోగాత్మకంగా వివరించాలన్నారు. వాటి ప్రయోజనాలను తెలియజేయాలని తెలిపారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షన్ముఖరాజు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి బి.శ్యామల, జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు వై.సత్యంనాయుడు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌రాజు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, విస్తరణాధికారులు, ఏపీసీఎన్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment