విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకోవాలి

Published Wed, Mar 12 2025 7:47 AM | Last Updated on Wed, Mar 12 2025 7:46 AM

విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకోవాలి

విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకోవాలి

పార్వతీపురం టౌన్‌: విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అభిలాషించారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి బస్సును ప్రారంభించారు. గతంలో జిల్లాలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేలా విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఆర్‌కే బీచ్‌ వద్ద గల ఐఎన్‌ఎస్‌ కుర్పురా సబ్‌మైరెన్‌ మ్యూజియం, ఎయిర్‌ క్రాఫ్ట్‌ మ్యూజియం, ఆర్కియాలజీ మ్యూజియంలను సందర్శించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులందరికీ ఆయా ప్రాంతాల్లోని కొత్త విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ విధంగా తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు నాంది పలకాలని కలెక్టర్‌ పిలులపునిచ్చారు. మండలానికి మూడు పాఠశాలలు చొప్పున జిల్లాలోని 15 మండలాల నుంచి 45 మంది విద్యార్ధులు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు బయలుదేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌. తిరుపతినాయుడు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

ఎవెన్యూ ప్లాంటేషన్‌ పెద్ద ఎత్తున చేపట్టాలి

పార్వతీపురంటౌన్‌/పార్వతీపురం: ఎవెన్యూ ప్లాంటేషన్‌ పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన అటవీ కార్యకలాపాలపై తన చాంబర్‌లో డీఎప్‌ఓ ప్రసూనతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రహదారుల వెంబడి ఎవెన్యూ ప్లాంటేషన్‌, చెరువు చుట్టూ ప్లాంటేషన్‌, గ్రామల్లో చెట్ల పెంపకానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీడ్‌ బాల్స్‌ తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, వన సంరక్షణ సమితుల ద్వారా ప్లాంటేషన్‌ పనులు చేపట్టాలని, త్కాలిక హోల్డింగ్‌ ఏరియా ఏర్పాట్ల పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జిల్లాలో చిత్తడి నేలల సరిహద్దులు, వాటి నోటిఫికేషన్‌పై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement