జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.
అంతర రాష్ట్ర ఫెన్సింగ్
క్రీడలకు విద్యార్థి ఎంపిక
విజయనగరం అర్బన్: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్ క్రీడలో అంతర్ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.
ఎకనామిక్స్–1 పరీక్షకు 580 మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పరీక్షకు 580మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఒకేషనల్ పేపర్3, ఎకానమిక్స్–1 పరీక్షకు 9540 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8,960మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు.
30 కేజీల గంజాయి పట్టివేత
పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు దుర్గ గుడి వద్ద 30 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో దుర్గ గుడి వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మహమ్మద్ షఫీజ్, దివ్యాన్షు శుక్లా, ఓం శుక్లాల నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
జిల్లా ప్రయాణికుల
లోగో ఆవిష్కరణ
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రయాణికుల లోగోను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమసంఘం ఈ లోగోను రూపొందించింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణరావు, తోటపల్లి ట్రస్ట్ ట్రెజరర్ జి.శ్రీరామచంద్రమూర్తి, డీఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ స్టాఫ్ బ్రాండ్ ప్రతినిధి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురి అరెస్టు
సీతంపేట: గతంలో సారా విక్రయిస్తూ పరారైన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్సై వై.అమ్మన్నాయుడు మంగళవారం తెలిపారు. మండలంలోని ఆనపకాయలగూడ గ్రామానికి చెందిన సిమ్మయ్య సారా విక్రయిస్తుండగా పరారయ్యాడని, ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. అలాగే ఇటీవల నెల్లిగండి గ్రామానికి చెందిన కె.తేజేశ్వరరావు 30 లీటర్ల సారా విక్రయిస్తూ పరారవడంతో పట్టుకుని ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.
దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో..
దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కోసంగి గ్రామంలో 20 లీటర్ల సారా పట్టుకున్నట్టు ఎస్సై అహ్మద్ తెలిపారు. ఈ కేసులో గౌరునాయుడిని అరెస్టుచేశామని చెప్పారు.
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment