● యూటీఎఫ్ రాష్ట్రకార్యదర్శ మురళీమోహనరావు
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఎన్ని ఫౌండేషన్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారో బహిర్గతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహనరావు అధికారులను శనివారం డిమాండ్ చేశారు. ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు ఎస్‌ఎంసీలను రహస్యంగా సమావేశపరచి తప్పుదోవ పట్టించి ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తక్షణమే ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు ప్రయత్నాలను నిలిపివేయాలని కోరారు. లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment