పార్వతీపురంటౌన్: జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక శనివారం సెలవుపై వెళ్లారు. ఆమె స్థానంలో ఎఫ్‌ఏసీ బాధ్యతలు ప్రస్తుతానికి ఎవరికీ అప్పగించలేదు. పార్వతీపురం సబ్‌కలెక్టర్, ఐటీడీఏ పీఓగా ఉన్న అశుతోష్ శ్రీవాత్సవకు ఎఫ్‌ఏసీ జేసీగా బాధ్యతలు అప్పగిస్తే ఆయన మూడు బాధ్యతలు నిర్వహించా ల్సి ఉంటుంది. ఎఫ్‌ఏసీ జేసీగా ఎవరికి ఇస్తారో అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ
కొమరాడ/గుమ్మలక్ష్మీపురం/కురుపాం: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ కురుపాం సీహెచ్‌సీ సిబ్బందికి సూచించారు. సీహెచ్‌సీని ఆయన శనివారం తనిఖీ చేశారు. వార్డులు, లేబర్ రూమ్, మందుల నిల్వ గది, రికార్డులు పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. సదుపాయాలు, సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌సీ కొత్త భవనాల నిర్మాణ పురోగతిపై ప్రశ్నించారు. అనంతరం కొమరాడ మండలంలోని మాదలింగి పీహెచ్‌సీని పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి జగన్మోహనరావు, సూపరింటెండెంట్ శోభారాణి, తదితరులు ఉన్నారు.
ఎకై ్సజ్ ‘గుట్టు’ రట్టు అయ్యేనా?
● మద్యం షాపు లైసెన్స్‌దారుల నుంచి అక్రమ వసూళ్లపై ఆరా
● ఒక్కో సీఐ పరిధిలో ఇద్దరేసి చొప్పున లైసెన్స్‌దారులకు పిలుపు
● డీసీ కార్యాలయంలోనే గుట్టుగా విచారణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎకై ్సజ్ శాఖలో భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడిన ఓ ఉన్నతాధికారి గురించి గుట్టుగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. విజయనగరంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి విచారణ సాగింది. జిల్లాలో ఒక్కో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో ఇద్దరేసి మద్యం షాపు లైసెన్స్‌దారులను రప్పించి విచారణ జరిపారు. ఇదే అదనుగా విచారణలో ఏం చెప్పాలో ఆయా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సదరు మద్యం షాపుల లైసెన్స్‌దారులకు ముందుగానే బెదిరించి మరీ ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అలా సదరు ఉన్నతాధికారిపై ఈగ కూడా వాలకుండా జాగ్రత్త పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్‌దారుల నుంచి మామూళ్లు వసూలు చేసిన వ్యవహారాన్ని గత జనవరి నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఎకై ్సజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి రెండు జిల్లాలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు రూ.4 కోట్ల వరకూ వసూలు చేయాలని టార్గెట్ పెట్టిన విషయాన్నీ బహిర్గతం చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే అడిషినల్ డైరెక్టర్ దేవకుమార్ విజయనగరం వచ్చారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే విచారణ ప్రారంభించారు. ఒక్కో సీఐ ఇద్దరేసి చొప్పున మద్యం దుకాణాల లైసెన్స్‌దారులను తీసుకురావాలని చెప్పడంతో జిల్లా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. విచారణకు హాజరైన లైసెన్సీలు ఏం చెప్పారనేదే ఇప్పుడు కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment