ఒడిశా దూకుడు
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
కొటియా గ్రామాల్లో
సమస్య పరిష్కరిస్తారా?
ఆంధ్రా–ఒడిశా మధ్య పలు వివాదాలకు తెరదించేందుకు గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా ఒడిశా వెళ్లి అక్కడ నాటి సీఎం నవీన్‌పట్నాయక్‌తో మాట్లాడారు. కొటియా గ్రామాల్లో వివాదాలు జరగకుండా నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సైతం కృషిచేశారు. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సంక్షేమ పాలనను చేరువచేశారు. నేడు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రాలో సైతం ఆ పార్టీ అండదండలతో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. వివాదాస్పద కొటియా గ్రామాల సమస్య పరిష్కారానికి ఇదే మంచి సమయమని, ఆ దిశగా సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చొరవ చూపాలని గిరిజన నాయకులు కోరుతున్నారు. కొటియా గ్రామాల సమస్యపై నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయమంలో చేసిన విమర్శలకు నేడు బదులిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం దూకుడు పెంచింది. ఆ గ్రామాలన్నీ తమవేనంటూ అధికారులు హల్‌చల్ చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నేమ్ బోర్డులను సైతం పీకేశారు. పట్టుచెన్నేరు గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే జల్‌జీవన్ మిషన్ పనులకు ఇటీవల వెళ్లిన కూలీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కొటియా నుంచి పట్టుచెన్నేరుకు సుమారు 15 కి.మీ మేర బీటీ రోడ్డు నిర్మాణాన్ని ఒడిశా ప్రభుత్వం తలపెట్టింది. స్టేటస్ కో అమలులో ఉన్న ఈ ప్రాంతాల్లో ఆంధ్రా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఒడిశా ప్రభుత్వం, అధికారులు అడ్డుకుంటుడంగా, ఇదే ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం యథేచ్ఛగా పనులు చేపడుతున్నా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొటియా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమను ఆంధ్రాలో కలపాలంటూ గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నా వారి మొర ఆలకించేవారు కరువయ్యారు. గత ప్రభుత్వం గంజాయిభద్రకు మంజూరుచేసిన హెల్త్‌సెంటర్ భవనం నిధులను సైతం ఆంధ్రా అధికారులు ఈ వివాదాలను సాకుగా చూపి ఎగువశెంబికు మళ్లించినట్టు సమాచారం.
న్యూస్‌రీల్
కొటియా నుంచి పట్టుచెన్నేరుకు 15 కి.మీ.మేర బీటీ రోడ్డు నిర్మాణం
పల్లెల్లో ఒడిశా అధికారుల హల్‌చల్
ఆంధ్రా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్న వైనం
పట్టించుకోని ఆంధ్రా ప్రభుత్వం
ఒడిశా దూకుడు
ఒడిశా దూకుడు
ఒడిశా దూకుడు
Comments
Please login to add a commentAdd a comment