ఆదివాసీ సంస్కృతికి ప్రతీక.. అక్షరబ్రహ్మ ఆలయం
భామిని: అక్షరాలే విగ్రహాలుగా ఉన్న అక్షర బ్రహ్మ ఆలయం, దేశాంతరాలు చాటే థింసా నృత్యాలు ఆదివాసీ గిరిజనుల ఔన్నత్యాన్ని చాటుతున్నాయని, వారి సంస్కృతికి ప్రతీకలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్‌రెడ్డితో కలిసి భామిని మండలం మనుమకొండను శనివారం సందర్శించారు. గిరిజనులతో మాట్లాడారు. నీతి ఆయోగ్ ప్రతిపాదనతో మనుమకొండ ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు. గ్రామానికి చెందిన ఒక ఆదివాసీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాడ్లాడేలా ఏర్పాట్లు చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేశారు. గ్రామానికి సబ్‌సెంటర్ మంజూరు చేయిస్తానని చెప్పారు. వీడీవీకేలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఆదివాసీ బాలిక మండంగి తుర్ణమామి బీటెక్ చేసి నిరుద్యోగిగా ఉండడంపై ఆరా తీశారు. యాస్పిరేషన్ బ్యాంక్‌కు అంబాసీడర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు. ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణానికి కలెక్టర్ స్వయంగా ఆర్థిక సహాయం అందజేశారు. గిరిజన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు అవసరమైన మినీగోదాం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. గిరిజన సంక్షేమ ఈఈ రమాదేవికి సూచనలు చేశారు. నిరుద్యోగుల కోసం లైబ్రరీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. పలు సమస్యలను సర్పంచ్ నిమ్మల కేశవ, ఎంపీటీసీ పత్తిక మురళీ, మాజీ సర్పంచ్‌లు నిమ్మల కోరా, నిమ్మల అన్నయ్యలు వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీహెచ్‌ఓ గణేష్, తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీఓ సత్యం, ఎంఏఓ సింహాచలం, ఏపీఓ చక్రపాణి, ఏపీఓ బాబూరావు, బత్తిలి ఎస్‌ఐ అనీల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
ప్రధానమంత్రితో మాట్లాడిస్తానని ఆదివాసీలకు భరోసా
ఆదివాసీ సంస్కృతికి ప్రతీక.. అక్షరబ్రహ్మ ఆలయం
Comments
Please login to add a commentAdd a comment