కుంకీ ఏనుగులు వచ్చేదెప్పుడు?
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఏనుగుల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అరకు పార్లమెంటు సభ్యులు గుమ్మతనూజా రాణి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మన్యం జిల్లాలో ఇప్పటికే ఏనుగుల బారినపడి 12 మంది వరకూ మృతి చెందడం బాధాకరమన్నారు. కుంకీ ఏనుగులు రప్పించి ఇక్కడి గజరాజుల సమస్య పరిష్కరిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. త్వరితగతిన ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. నెలలు గడుస్తున్నా కుంకీల విషయంలో ఇప్పటికీ ఏ విధమైన ముందు అడుగూ పడకపోవడంపై అధికారులు స్పష్టమైన సమాధానం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రతిరోజూ ఏనుగుల వల్ల రైతుల పంటలకు నష్టం ఏర్పడుతోందని.. గ్రామాల్లో ప్రజలు ప్రాణభయంతో గడపాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మన జాతి సంపదైన వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గతంలో ఇక్కడ గుర్తించిన విధంగా ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వాటికి అన్ని సదుపాయాలూ కల్పించాలన్నారు. భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. గజరాజులు సంచరించే ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బాధితులకు తక్షణం నష్ట పరిహారం అందించే చర్యలు చేపట్టాలని సూచించారు.
పూతికవలసలో ఏనుగుల బీభత్సం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని పూతికవలస గ్రామంలో శనివారం ఉదయం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు గ్రామంలోని ఏగిరెడ్డి సింహాచలానికి చెందిన 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటలను నాశనం చేశాయి. అప్పులు చేసీ మరీ కర్భూజ పంటను సాగుచేశానని, దిగుబడి వచ్చిన సమయంలో ఏనుగులు పంటను ధ్వంసం చేయడం వల్ల సుమారు 3 లక్షల వరకు నష్టపోవాల్సివచ్చిందని, ప్రభుత్వాధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
జిల్లాలో గజరాజుల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలి
అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి
కుంకీ ఏనుగులు వచ్చేదెప్పుడు?
కుంకీ ఏనుగులు వచ్చేదెప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment