మనసాస్మరామి..
●వైభవంగా ప్రారంభమైన కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ●క్యూలో బారులు తీరిన భక్తులు ●అధికార పార్టీ నేతల అనుచరులకు పక్క దారి దర్శనాలు ●రూ.100 టిక్కెట్ ఉన్నా తప్పని ఇక్కట్లు ●పట్టించుకోని దేవదాయ, పోలీసు శాఖలు
అమ్మవారిని దర్శించుకున్న
జెడ్పీ చైర్మన్
చీపురుపల్లి: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాల్లో భాగంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు రోజులు జాతరలో భాగంగా తొలి రోజు ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖ ర్, శ్రీదేవి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు
చీపురుపల్లి:
కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవములు ఆదివా రం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆపదల నుంచి గట్టెక్కించు తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్దలతో వేడుకున్నారు. ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనా లు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలై న్లు నిండిపోయాయి. మధ్యా హ్నం 1 గంట వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకు మ, చీరలతో మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభంతో పాటు రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేసి దీపాలు వెలిగించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌తో పాటు ఒడిశా ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
వీఐపీ పేరుతో యథేచ్ఛగా దర్శనాలు
అమ్మవారి జాతరలో తొలి రోజు దర్శనాల విషయంలో భక్తులు నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.100, రూ.50, రూ.20, రూ.10 టిక్కెట్లును విక్రయించారు. వాటికి సంబంధించి అన్ని క్యూలైన్లలో భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అయితే వీఐపీ దర్శనాల కోసం ఉంచిన గేటు నుంచి సామాన్యులు సైతం పదుల సంఖ్యలో వెళ్తుండడంతో దర్శనాలకు ఆటంకం కలిగిందని పలువురు భక్తులు దేవదాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికార కూటమి నాయకులు దగ్గరుండి సామాన్యులను వీఐపీ గేటు నుంచి నేరుగా గర్భగుడికి తీసుకెళ్లి దర్శనాలు చేయించుకున్నారని దీంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన తామంతా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పట్టించుకోని దేవదాయ, పోలీస్ శాఖలు
పక్క గేటు, వెనుక ద్వారం నుంచి దర్శనాలు నిలువరించి టిక్కెట్లు కొనుగోలు చేసుకుని దర్శనాలకు వెళ్లే భక్తులకు అవస్థలు లేకుండా చూడాల్సిన దేవదాయ, పోలీస్ శాఖలు కనీసం చర్యలు చేపట్టలేదనే విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. వీఐపీ గేటు తాళం టీడీపీ కార్యకర్తల చేతికి ఇచ్చి సాధారణ భక్తుల దర్శనాలకు జాప్యం జరిగే విధంగా దేవదాయ, పోలీస్ శాఖలు వ్యవహరించడం ఏమిటని క్యూలైన్లలో భక్తులు పోలీస్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. వీఐపీ గేటు నుంచి అధిక సంఖ్యలో సాధారణ భక్తులను పంపించడం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళ్తున్న తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కనీసం మిగిలిన రెండు రోజులైన ఇలాంటి చర్యలను నిలువరించాలని భక్తులు కోరుతున్నారు.
మనసాస్మరామి..
మనసాస్మరామి..
మనసాస్మరామి..
మనసాస్మరామి..
Comments
Please login to add a commentAdd a comment