అమ్మవారికి ఘటాల నివేదన | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి ఘటాల నివేదన

Published Mon, Mar 3 2025 1:33 AM | Last Updated on Mon, Mar 3 2025 1:29 AM

అమ్మవ

అమ్మవారికి ఘటాల నివేదన

సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025

గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామంలో శ్రీ గట్టాలమ్మ ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆదివారం ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మేళతాళాల నడుమ, మంగళ వాయిద్యాలతో పెద్ద సంఖ్యలో మహిళలు ఘటాలతో బారులు తీరారు. ఊరేగింపుగా గట్టాలమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లారు. ఉదయం 11 గంటలకు విగ్రహం, పూర్ణ కలశ ప్రతిష్ఠ మహోత్సవం భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ బొంతాడ మహేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. – గరుగుబిల్లి

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
అమ్మవారికి ఘటాల నివేదన 1
1/1

అమ్మవారికి ఘటాల నివేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement