శబ్ద కాలుష్యం నివారించాలి
విజయనగరం ఫోర్ట్: శబ్ద కాలుష్యం నివారించాలని అందుకుగాను డీజేలు వంటి పోగ్రాంలు నిరోధించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవన రాణి అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వకూడదని తెలిపారు. అవసరం మేరకు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని సూచించారు. మానవుడికి వినికిడి చాలా ప్రధానమైనదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.రాణి, ఎన్‌సీడీపీఓ డాక్టర్ వీవీబీ సుబ్రహ్మణ్యం, డీపీఎంఓ డాక్టర్ సూర్యనారాయణ, డీఎంఓ మణి, డాక్టర్ వెంకటేష్, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవన రాణి
Comments
Please login to add a commentAdd a comment