భక్తి మార్గం అనుసరణీయం
● మాజీ ఎంపీ బెల్లాన
వంగర: ప్రజలు భగవన్మామస్మరణతో మెలిగి భక్తిమార్గాన్ని అనుసరణీయంగా భావించా లని విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయ న వంగర మండల పరిధి గీతనాపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామాలయం పునఃప్రతిష్ట, శ్రీఆంజనేయస్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నెయిగాపుల శివరామకృష్ణయ్య, నెయిగాపుల ప్రసాదరావులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, పార్టీ నాయకులు యలకల వాసునాయుడు, కిమిడి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సెంచూరియన్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో నాగ్‌పూర్‌కు చెందిన కోడ్ ఎఫ్ సొల్యూషన్స్ సంస్థ సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫోరెన్సిక్ అనలిస్ట్, ఫోరెన్సిక్ ట్రైనీ, ఇన్వెస్టిగేటర్, క్రైమ్ ఆఫీసర్స్, తదితర ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శుభం రాజేంద్ర సాహు మాట్లాడుతూ బీఎస్సీ, ఎమ్మెస్సీ పోరెన్సిక్‌లో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కాలంలో రూ.10వేలు స్టైపెండ్ అందిస్తామన్నారు. ఇంటర్న్‌షిప్ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్ హెడ్ శుభాంగి నీల్‌కాంత్ నిఖారే పాల్గొన్నారు.
గొర్రెపోతుల పందాలపై పోలీసుల దాడి
లక్కవరపుకోట: మండలంలోని ఖాసాపేట గ్రామం సమీపంలో గల తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గొర్రెపోతుల పందాలపై ఎస్సై నవీన్‌పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందెం నిర్వహిస్తున్న ఐదుగురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2వేలు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో
జేఎల్‌ఎం మృతి
చీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురం సమీపంలో విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పేరిపి గ్రామానికి చెందిన కరణం సత్యం(48) మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం పేరిపి గ్రామానికి చెందిన కరణం సత్యం ఆర్‌ఈసీఎస్‌లో చీపురుపల్లి మండలంలోని పత్తికాయవలస జూనియర్ లైన్‌మన్(జెఎల్‌ఎం)గా పనిచేస్తున్నాడు. అయితే పట్టణంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజులు నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా ఉన్నతాధికారులు జేఎల్‌ఎంలకు చీపురుపల్లిలో అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో విధి నిర్వహణలో భాగంగానే సత్యం ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత చీపురుపల్లి నుంచి గరివిడి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు ఉన్నారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భక్తి మార్గం అనుసరణీయం
భక్తి మార్గం అనుసరణీయం
భక్తి మార్గం అనుసరణీయం
Comments
Please login to add a commentAdd a comment